భద్రాద్రిలో ఘనంగా శ్రీరాముని ఎదుర్కోలు ఉత్సవం
వరంగల్ టైమ్స్, భద్రాద్రి : భద్రాద్రిలో శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి వారల ఎదుర్కోలు మహోత్సవం మిథిలా మైదానంలో శనివారం సాయంత్రం కనుల పండుగగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అంతకు ముందు శ్రీ సీతారామచంద్ర స్వామి వారలను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సీతారామచంద్ర స్వామి కల్యాణ వేడుకలు జరుగనున్నాయి. ప్రభుత్వం తరపున దేవాదావయశాఖ మంత్రి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.రేపు జరుగనున్న కల్యాణోత్సవ వేడుకకు పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం కావడంతో చలువ పందిళ్లు, షామియానాలు, కూలర్లను ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోసం 170 క్వింటాళ్ల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. శ్రీరామనవమి రోజున తలంబ్రాలకు 50 కౌంటర్లు, లడ్డూలకు 30 కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని తీరొక్క పూలు, విద్యుద్ధీపాలతో అలంకరించారు. వేడుకల నేపథ్యంలో పోలీసులు పకడ్భందీ ఏర్పాట్లు చేశారు.