ఆధారాలతో వచ్చి వాహనాలు తీసుకెళ్లండి : సీపీ

ఆధారాలతో వచ్చి వాహనాలు తీసుకెళ్లండి : సీపీ

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు తిరిగి అప్పగించడానికి నిర్ణయించినట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న 165 వాహనాలను మడికొండ పోలీస్ శిక్షణా కేంద్రంలో భద్రపర్చడం జరిగిందన్నారు. వాటిని పోలీస్ స్టేషన్ వారిగా గుర్తించి సంబంధిత యజమానులకు నోటీసులు పంపించబడినట్లు పేర్కొన్నారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహనాలు తిరిగి అందజేస్తామని సీపీ పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం సీసీఆర్ టీఏసీపీ 9491089116 లేదా ఎస్.ఐ. 7901138335 నంబర్లకు సంప్రదించగలరని సీపీ తరుణ్ జోషి ఓ ప్రకటనలో కోరారు.