ఏప్రిల్ 11న ఏపీలో కొత్త మంత్రివర్గం
వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. సోమవారం ఉదయం 11 గంటల 31 నిమిషాలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసే మంత్రులకు గేట్ పాస్ లు ఇవ్వనున్నారు. జీఏడీ అధికారులు పాస్ లను సిద్ధం చేశారు. ఈ పాస్ లు ఎవరికి చేరితే వారు మంత్రివర్గంలోకి రాబోతున్నట్లు లెక్క కొత్త మంత్రులెవరనేది ఈ సాయంత్రం లేదా రేపు గవర్నర్ కు జాబితా చేరనుంది. ఇటు ప్రమాణ స్వీకారానికి చురుగ్గా ఏర్పాటు సాగుతున్నాయి.ప్రమాణ స్వీకారం అనంతరం కొత్త, పాత మంత్రులు, అతిథులకు తేనీటి విందు ఇవ్వనున్నారు. గవర్నర్ , సీఎం కూడా ఇందులో పాల్గొంటారు. ప్రమాణ స్వీకారానికి వచ్చే అతిథులకు ప్రత్యేక పాస్ లు సిద్ధం చేశారు. ఏపీ నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం పక్కనున్న ఖాళీ ప్రదేశంలో ఏర్పాట్లు చేస్తున్నారు. పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.