దర్శకుడు తేజ బాలీవుడ్ ఎంట్రీ 

దర్శకుడు తేజ బాలీవుడ్ ఎంట్రీ

వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ తేజ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. తెలుగు చిత్రసీమలో మంచి పాపులర్ అయిన తేజ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మేరకు తేజ ఇప్పటికే రెండు బాలీవుడ్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. వీటిని టైమ్ ఫిల్మ్స్ NH స్టూడియోస్ అండ్ ట్రిఫ్లిక్స్ ఫిల్మ్స్‌తో కలిసి నిర్మించనుంది.దర్శకుడు తేజ బాలీవుడ్ ఎంట్రీ తేజ సైన్ చేసిన రెండు ప్రాజెక్ట్‌లలో ఒకటి ‘జఖమి’.ఇద్దరు బాలీవుడ్ తారలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం కాశ్మీర్‌లోని మంచు ప్రాంతంలో జరగనుంది. మరో ప్రాజెక్ట్ ‘తస్కరి’ అనే వెబ్ సిరీస్‌. 1980 బ్యాక్‌డ్రాప్‌లో నాలుగు సీజన్ల సిరీస్ గా, ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తారు.