కష్టపడి చదివితే సర్కారు కొలువు ఖాయం :సీపీ

కష్టపడి చదివితే సర్కారు కొలువు ఖాయం :సీపీ

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ప్రణాళికబద్దంగా కష్టపడి చదివితే ప్రభుత్వం ఉద్యోగాలు సాధించడం ఖాయమని వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి యువతకు సూచించారు. వరంగల్ కమిషనరేట్ పోలీసులు నిర్వహించిన ఉచిత పోలీస్ ఉద్యోగ పోటీ పరీక్షల శిక్షణ తరగతుల్లో యువతీ, యువకులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరికి హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ యువతకు స్టడీ మెటీరియల్ అందజేశారు.కష్టపడి చదివితే సర్కారు కొలువు ఖాయం :సీపీవరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువత పోలీస్ ఉద్యోగాలకు కోసం నిర్వహించే పోటీ పరీక్షల్లో రాణించేందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9 కేంద్రాల్లో 2 వేలకు పైగా యువతకు 80 రోజుల పాటు ఉచిత కోచింగ్ ఇచ్చినట్లు తెలిపారు.ఈ శిక్షణ తరగతుల్లో పోటీ పరీక్షల్లో రాణించేందుకుగాను అవసరమయిన వివిధ అంశాలపై హైదరాబాదు పీ.జె.ఆర్ కోచింగ్ సెంటర్‌ నిపుణులైన అధ్యాపకులచే ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు రూ. 2వేల విలువైన స్టడీ మెటీరియల్ అందించారు.

ముఖ్యంగా యువత ప్రతీ రోజు పది నుండి పన్నెండు గంటలు చదివితేనే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారని అన్నారు. అదే విధంగా యువత బలహీనంగా వున్న సబ్జెక్ట్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా ప్రణాళిక పరంగా చదవడంతో పాటు పోటీ పరీక్షల్లో రాణించాలంటే కొద్ది రోజులు సెల్ ఫోన్లకు దూరంగా వుండడం మంచిదని సీపీ విజ్ఞప్తి చేశారు.

అన్ని ప్రభుత్వ పోటీ పరీక్షల్లో రాణించే విధంగా నిపుణులచే శిక్షణ అందజేయడం సంతోషించదగిన విషయమని యువతీ, యువకులు అన్నారు. ముఖ్యంగా తమ భవిష్యత్తు కోసం ముందస్తుగానే తమ సహకారాన్ని అందించిన వరంగల్ కమిషనరేట్ పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ జోన్ డిసిపి అశోక్ కుమార్, కాజీపేట, హన్మకొండ, వరంగల్ ఎసిపిలు శ్రీనివాస్, జితేందర్‌రెడ్డి, గిరికుమార్, ఇన్ స్పెక్టర్లు రాఘవేందర్, శ్రీనివాస్, రవికుమార్,రమేష్, పి.జె. ఆర్ కోచింగ్ సెంటర్ డైరక్టర్ జగదీశ్వర్ రెడ్డితో ఇతర పోలీస్ సిబ్బంది మరియు శిక్షణ పొందిన యువతి, యువకులు పాల్గొన్నారు.