బుక్ వాక్ పుస్తక నడక

బుక్ వాక్ పుస్తక నడక

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ :  35 వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యక్రమంలో బుక్ వాక్ నిర్వహించారు. లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ గుడి నుండి బుక్ ఫెయిర్ వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో అవంతి కాలేజ్ విద్యార్దులు,పాఠశాల విద్యార్దులు ఉత్సహంగా పాల్గోన్నారు. పుస్తకం వర్ధిల్లాలలని విద్యార్ధులు నినదించారు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో, పుస్తకమే ప్రపంచం అనే నినాదాలు లతో ప్లకార్డ్ ను ప్రదర్శించారు. పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ లేటి దామోదర్ గుప్తా, బుక్ ఫెయిర్ అద్యక్షలుు జూలరు గౌరిశంకర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవా బుక్ వాక్ సందర్బంగా జెండా ఊపి ప్రారంభించారు.బుక్ వాక్ పుస్తక నడకపోలీస్ కు లాఠీ తోపని లేదు పుస్తకాల డిమాండ్ ఉంది- కోలేటి దామోదర్ గుప్తా- పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ :

పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా మాట్లాడుతూ… తెలంగాణ లో పోలీసులు లాఠీ కి పనిలేదు కాని పుస్తకాలకు డిమాండ్ పెరిగిందని అన్నారు.ఇంటర్ నెట్ వచ్చిన తర్వాత పుస్తకం తెరమరుగు అవుతుందని అంటున్నారు.కాని ప్రతి సంవత్సరం బుక్ ఫెయిర్ ను అదరణ చూస్తూంటే పుస్తకాల డిమాండ్ అర్దం అవుతుందని చేప్పారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక వేల పుస్తకాలు చదివిన స్పూర్తి మనకు రావాలన్నారు. తెలంగాణలో కవులను కరువు లేదన్నారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఇంటర్నేషన్ స్థాయిలో ఎదగాలని అన్నారు.జయహా పుస్తకం. సమాజంలో పుస్తకమే వర్ధిల్లుతుందని చేప్పారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ అద్యక్షులు జూలూరు గౌరి శంకర్ మాట్లాడుతూ…బుక్ ప్రదర్శనలో పుస్తక నడక ద్వార యువతకు,,విద్యార్దులకు గొప్పసందేశం ఇచ్చేందుగాను ఈ బుక్ వాక్ ను నిర్వహించామని తెలిపారు. ప్రతి వారు పుస్తకం చదవాల్సిన అవసరం ఉందన్నారు.పుస్తకాలు చదవడం ద్వార తమను తాము ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు పుస్తకాలు దొహద పడుతాయని చేప్పారు. రాష్ట్రంలో ఉన్నా ప్రతి విద్యార్దికి ఈ వాక్ ద్వార సందేశం చేరాలని అన్నారు జూలూరు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాఘవా మాట్లాడుతూ… పుస్తకాలు చదవండి,మొక్కలు నాటండి అని పిలుపునిచ్చారు.

అవాంతి కాలేజ్ కర్పెండెంట్ ప్రో.సోమేశ్వర్ రావు మాట్లడుతూ సెల్ ఫోన్ ను పక్కన పెట్టి పుస్తకాలు చదవాలని అన్నారు. మాట్లడుతూ మంచి పుస్తకాలు చడవడం ద్వార మంచి పౌరులు ఎదగవ వచ్చిన తెలిపారు.

హైదరాబాద్ బుక్ ఫెయిర్ అద్యక్షులు జూలూరు గౌరి శంకర్ మాట్లాడుతూ…బుక్ ప్రదర్శనలో పుస్తక నడక ద్వార యువతకు,,విద్యార్దులకు గొప్పసందేశం ఇచ్చేందుగాను ఈ బుక్ వాక్ ను నిర్వహించామని తెలిపారు. ప్రతి వారు పుస్తకం చదవాల్సిన అవసరం ఉందన్నారు

ఈ కార్యక్రమంలో బుక్ ఫెయిర్ కార్యదర్శి శృతికాంత్ భారతి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వాసులు పాల్గోన్నారు.