నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం..!

హైద‌రా‌బాద్‌: ఉత్తర ఇంటీ‌రి‌యర్‌ కర్ణా‌టక పరి‌సర ప్రాంతాల్లో 3.6 కిలో‌మీ‌టర్ల నుంచి 4.5 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు ఉప‌రి‌తల ఆవ‌ర్తనం కొన‌సా‌గు‌తుం‌డగా, వాయవ్య బంగా‌ళా‌ఖా‌తంలో 2.2 కిలో‌మీ‌టర్ల నుంచి 5.8 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌వ‌రకు మరొకటి ఏర్ప‌డింది. వీటి ప్రభా‌వంతో రాష్ట్రం‌లోని పలు‌చోట్ల ఇవాళ, రేపు ఉరు‌ములు, మెరు‌పు‌లతో కూడిన ఓ మోస్తరు వానలు కురు‌స్తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధా‌నంగా ఆది‌లా‌బాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌, జగి‌త్యాల, నిజా‌మా‌బాద్‌, కామా‌రెడ్డి, రాజన్న సిరి‌సిల్ల, సంగా‌రెడ్డి, మెదక్‌, వికా‌రా‌బాద్‌, రంగా‌రెడ్డి, నారా‌య‌ణ‌పేట, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, వన‌పర్తి, జోగు‌ళాంబ గద్వాల జిల్లాల్లో ఒకటి రెండు‌చోట్ల భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌దని అధికారులు తెలిపారు. ఉప‌రిత ఆవ‌ర్తనం ప్రభా‌వంతో రాగల మూడు రోజులు గ్రేటర్‌ హైద‌రా‌బాద్‌ పరి‌ధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవ‌కాశం ఉన్న‌దని వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కా‌రులు తెలి‌పారు.