టూరిజం హబ్ గా పైడిపల్లి

వరంగల్ అర్బన్ జిల్లా: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 1వ డివిజన్ పైడిపల్లి ప్రాంతాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేయుటకు ప్రణాళిక రచించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాశ్ రావు తో కలసి నగరంలోని 1వ డివిజన్ పైడిపల్లి లో ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్ ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములున్నాయని వాటిని అభివృద్ధి చేయాలని మంత్రి కేటీఆర్ కు విన్నవించగా కేటీఆర్ ఆదేశాల మేరకు నేడు ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగిందని మంత్రి తెలిపారు. నగరానికి దగ్గరగా ఉన్నందున సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిలో అన్ని విధాలా అభివృద్ధి చేయుటకు వారం రోజుల్లోగా ప్రణాళికను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని అన్నారు. ఇదివరకే 18 ఎకరాల భూమి మునిసిపల్ కార్పొరేషన్ కు అప్పగించడం జరిగిందని, మిగిలిన 32..టూరిజం హబ్ గా పైడిపల్లి

ఎకరాలు కార్పొరేషన్ కు అప్పగించి అభివృద్ధి చేస్తామని మంత్రి అన్నారు. అనంతరం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరురి రమేష్ మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవగంలోని విలీన గ్రామాల్లో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బెస్తాం చెరువులో స్మృతి వనం, చింతగట్టు, పైడిపల్లిలలో అభివృద్ధికి శ్రీకారం చుట్టి అతి త్వరలో విజయవంతం చేస్తామని అన్నారు. వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు మాట్లాడుతూ కేటీఆర్ ఆదేశాలననుసరించి పైడిపల్లిలోని సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని మునిసిపల్ కార్పొరేషన్ హ్యాండెడ్ ఓవర్ చేసుకొని పూర్తి స్థాయి లో టూరిజం హబ్ గా తీర్చిదిద్దుటకు కృషి చేస్తామని అన్నారు. ఈ ప్రదేశంలో స్మృతి, హరిత వనం, చిల్డర్న్స్ పార్క్, ఓపెన్ జిమ్, ఫిష్, డక్ పాండ్ లను ఏర్పాటు చేస్తామని ఆయన హామి ఇచ్చారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ పూలమాల వేసె విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. కెనాల్ పై చింత, టేకు,నెరేడు వనం బ్లాక్లను పెంచుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వీర భిక్షపతి, ఆర్డీఓ వాసు చంద్ర, ఆర్ఎఫ్ఓ నారాయణ రావు, సిహెచ్ఓ సునీతా, తహసీల్దార్ ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.