చట్టాన్ని చుట్టంగా మార్చుకున్న కేసీఆర్: రావు పద్మ

వరంగల్ అర్బన్: వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు ముగ్గురు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని బీజేపీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై వివరణ యిచ్చేందుకు రావు పద్మ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు వరంగల్ ఏసీపి కార్యాలయానికి చేరుకున్నారు. చట్టాన్ని చుట్టంగా మార్చుకున్న కేసీఆర్: రావు పద్మబీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్ పై టీఆర్ ఎస్ నాయకులు కోడిగుడ్లతో దాడి చేస్తే ఒక న్యాయం, ఆ దాడిని ఖండిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటిపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేస్తే మరో న్యాయమా అంటూ రావు పద్మ మండిపడ్డారు. అరెస్ట్ చేసిన బీజేపీ కార్యకర్తలను వదిలిపెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు కొట్టివేయాలని రావుపద్మ ఏసీపీ అధికారి ముందు డిమాండ్ చేశారు.