చలివేంద్రంను ప్రారంభించిన దాస్యం అభినవ్

చలివేంద్రంను ప్రారంభించిన దాస్యం అభినవ్ భాస్కర్

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వేసవి కాలం వచ్చిందంటే చాలు ఆకలి తీర్చడం కంటే, దప్పిక తీర్చేవాళ్లుంటే చాలు అని అనుకుంటాము. ఎర్రటి ఎండలో పనుల నిమిత్తం బయటికి వెళ్లే ప్రజల దాహార్తిని తీర్చేందుకు కొందరు గొప్ప మనస్సున్న వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు. సామాజిక సేవలో తాను సైతం అంటూ హనుమకొండ జిల్లా హంటర్ రోడ్డులోని ఈశ్వర్ ఎంటర్ ప్రైజెస్ యజమాని కొల్లూరు ఆదిత్య సాయి ముందుంటున్నాడు. 60వ డివిజన్ టీఆర్ఎస్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ స్ఫూర్తితో ఇప్పటికే పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్న కొల్లూరు ఆదిత్య సాయి నేడు శాయంపేట హంటర్ రోడ్డులో చలివేంద్రం ఏర్పాటు చేశారు.చలివేంద్రంను ప్రారంభించిన దాస్యం అభినవ్ఈ చలి వేంద్రాన్ని 60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగను కూడా వాహనదారులకు, బాటసారులకు అందించారు. ఈ చలివేంద్రంలో మంచి నీటితో పాటు, మజ్జిగను తాగి ప్రజలు తమ దాహార్తిని తీర్చుకోవాలని ఆదిత్యసాయితో పాటు కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ కోరారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఆదిత్య సాయిని , కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ తో పాటు స్థానికులు అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలతో ఎప్పుడూ ముందుండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు సాయి రాజు, అక్కెనపల్లి అరవింద్, సంపతి రాహుల్, నిఖిల్ రిషి తదితరులు పాల్గొన్నారు.