యాదాద్రికి బస్సు సర్వీస్ ను ప్రారంభించిన సీపీ 

యాదాద్రికి బస్సు సర్వీస్ ను ప్రారంభించిన సీపీ

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : యాదాద్రి పుణ్యక్షేత్రంను దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ యాజమాన్యం హనుమకొండ బస్టాండ్ నుండి యాదాద్రికి బస్సు సర్వీసులను నేటి నుండి ప్రారంభించారు. ఇందులో భాగంగా యాదాద్రి తరలివెళ్లే తొలి బస్సు సర్వీసును వరంగల్ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఆర్టీసీ అధికారులతో ప్రారంభించారు. యాదాద్రికి బస్సు సర్వీస్ ను ప్రారంభించిన సీపీ ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ అధికారులతో ప్రయాణించి తొలి టికెట్ కోనుగోలు చేశారు. అనంతరం పొలీస్ కమిషనర్ చేతుల మీదుగా యాదాద్రికి ఆర్టీసీలో ప్రయాణించే తొలి ప్రయాణికురాలి టికెట్ అందజేశారు.యాదాద్రి నరసింహస్వామిని దర్శించేందుకు భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ య‍ాజమాన్యం యాదాద్రికి బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం సంతోషించదగిన విషయమని సీపీ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని, భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సీపీ తరుణ్ జోషి సూచించారు.