శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్

శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్

వరంగల్ టైమ్స్, యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ దర్శనం అనంతరం బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన వటపత్రశాయి అలంకార సేవల్లో గవర్నర్ పాల్గొన్నారు. ఆలయ ఉద్ఘాటన తర్వాత మొట్టమొదటి సారి జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని గవర్నర్ అన్నారు.

ఈ నెల 28న స్వామివారి కల్యాణం జరుగుతున్నదని, తెలంగాణ ప్రజలంతా సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు గవర్నర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత, ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహ చార్యులు పాల్గొన్నారు.