కంటి వెలుగు 5,80,127మందికి ఐ స్క్రీనింగ్

కంటి వెలుగు 5,80,127మందికి ఐ స్క్రీనింగ్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు కార్యక్రమంలో నేటి వరకు 5,80,127 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1,83,375 మందికి రీడింగ్ అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. 88,423 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలను పంపిణీ చేశారు. 3,08,235 మందికి ఎటువంటి కంటి జబ్బులు లేవని గుర్తించారు. శుక్రవారం నాడు 17,805మందికి ఐ స్క్రీనింగ్ చేయగా 3767 మందికి రీడింగ్ అద్దాలను పంపిణీ చేశారు. 1877 మందికి ప్రిస్కిప్షన్ అద్దాలను త్వరలో అందజేయనున్నారు. 12161మందికి ఎటువంటి కంటి జబ్బులు లేవని గుర్తించారు.