కాంగ్రెస్ కార్యకర్తల దాహార్తి తీర్చిన టీఆర్ఎస్ యువనాయకుడు

కాంగ్రెస్ కార్యకర్తల దాహార్తి తీర్చిన టీఆర్ఎస్ యువనాయకుడు

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : ఒడ్డు ఎక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డు దిగాక బోడిమల్లన్న అన్న చందంగా వుంది హనుమకొండలో శుక్రవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభ తీరు. నేడు సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో ఏఐసీసీ యువనేత రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగే రైతు సంఘర్షణ సభకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏర్పాటు భారీ ఎత్తునే చేశారు. గత వారం, పది రోజుల నుంచే సభా ఏర్పాట్లను, సభా ప్రాంగణాన్ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు పర్యటించి, పర్యవేక్షించారు. అయితే సభ సక్సెస్ కావడానికి కార్యకర్తల సమీకరణలో, వారిని సభకు రప్పించడంలో చూపినంత ఉత్సాహం సభ ముగిసాక మాత్రం కల్పించలేదని బాధిత కార్యకర్తలు, ప్రజలు వాపోయారు.

కాంగ్రెస్ కార్యకర్తల దాహార్తి తీర్చిన టీఆర్ఎస్ యువనాయకుడుఅసలే ఎండాకాలం, ఎంత సాయంత్రం సభ నిర్వహించినప్పటికీ సభకు హాజరైన ప్రజలు, కార్యకర్తలకు కనీసం దాహార్తిని తీర్చే నాధులే లేరని బాధిత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అటుగా వెళ్తూ ఈ తంతును చూసిన నగరానికి చెందిన టీఆర్ ఎస్ యువనాయకుడు ఆదిత్య సాయి కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లను అందించి దాహార్తి తీర్చారు. పార్టీ ఏదైనప్పటికకీ కాంగ్రెస్ సభకు హాజరైన ప్రజలు పడిన ఇబ్బంది చూసి మజ్జిగ, మంచినీళ్ళు అందించి వారి దాహార్తిని తీర్చినట్లు టీఆర్ ఎస్ యువనాయకుడు ఆదిత్య సాయి తెలిపాడు.

తమ టీఆర్ ఎస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల శ్రేయస్సు కోరుతుందని, ఏ సభలు నిర్వహించినా, ఏ కార్యక్రమాలు చేపట్టినా టీఆర్ ఎస్ పార్టీ సభా ప్రాంగణానికి హాజరైన తమ కార్యకర్తలు, ప్రజలు దాహార్తిని తీర్చి, ఆకలి బాధను కూడా తీర్చుతుందని తెలిపాడు. అంతేకానీ సభ జరిగేంత వరకు కాంగ్రెస్ కార్యకర్తలను సభాప్రాంగణానికి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తల దాహార్తిని తీర్చడంలో విఫలం కావడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పుడే పట్టించుకోని వాళ్ళు, ఇక తర్వాత కార్యకర్తల బాగోగులు ఏం చూసుకుంటారని కాంగ్రెస్ కార్యకర్తలు , ప్రజలు మండిపడుతున్నారు.. ఏది ఏమైనప్పటీ తమ దాహార్తిని తీర్చిన ఆదిత్య సాయికి వారు ధన్యవాదాలు తెలిపారు.