నేటి నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు

నేటి నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 24 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించే ఈ పరీక్షలకు నిమిషం నిబంధనను కఠినంగా అమలు చేయనున్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థులు ఇప్పటికే హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు.నేటి నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలుపరీక్షలకు అధికారులు పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వసతులు కల్పించారు. పరీక్షల కోసం 1,443 కేంద్రాలు సిద్ధం చేశారు. వీటిలో 26 సెల్ఫ్ సెంటర్లున్నాయి. 386 ప్రభుత్వం, 206 గురుకులాలు, 840 ప్రైవేట్ కాలేజీలు, 11 ప్రభుత్వ స్కూళ్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9,07,393 విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

పరీక్షలు ప్రారంభమైన మూడో రోజు నుంచే మూల్యాంకనం ప్రారంభిస్తారు. ఈ నెల 8న సంస్కృతం పేపర్ తో మూల్యాంకనాన్ని ప్రారంభించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. తర్వాత మిగతా పేపర్ల మూల్యాంకనం నిర్వహిస్తారు. పరీక్షలు మే 24తో ముగియనున్నాయి. జూన్ 24 లోపు పరీక్షా ఫలితాలు వెల్లడించాలని బోర్డు భావిస్తున్నది.

పరీక్షలు ప్రారంభమైన మూడో రోజు నుంచే మూల్యాంకనం ప్రారంభిస్తారు. ఈ నెల 8న సంస్కృతం పేపర్ తో మూల్యాంకనాన్ని ప్రారంభించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. తర్వాత మిగతా పేపర్ల మూల్యాంకనం నిర్వహిస్తారు. పరీక్షలు మే 24తో ముగియనున్నాయి. జూన్ 24 లోపు పరీక్షా ఫలితాలు వెల్లడించాలని బోర్డు భావిస్తున్నది.

పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు-జాగ్రత్తలు
*విద్యార్థులు ఉదయం 8.30 గంటలకు ముందే పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
*పరీక్షా కేంద్రాల్లో ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు ఉంటారు. వీరి వద్ద ఓఆర్ఎస్ ద్రావణం, జ్వరం, తలనొప్పి మాత్రలు, కాటన్, బ్యాండేజీలుంటాయి.
*సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాల బండిల్స్ ను తెరుస్తారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే తిరిగి ప్యాకింగ్ చేస్తారు.
*హాల్ టికెట్లను వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
*విద్యార్థుల మధ్య ఒక మీటరు భౌతికదూరాన్ని అమలు చేస్తారు. బెంచీ చిన్నగా ఉంటే ఒక్కరు, పెద్దగా ఉంటే ఇద్దరు కూర్చునేలా ఏర్పాట్లున్నాయి.
*పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేయిస్తారు.
*పరీక్ష కేంద్రాలను విద్యార్థి కాలేజీకి 5 కిలో మీటర్ల సమీపంలోనే ఏర్పాటు చేశారు.

ఇక ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జిల్లా, నోడల్ అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఇన్విజిలేటర్లు సైతం ఫోన్లు తీసుకెళ్లొద్దని ఆదేశించారు.

సిబ్బంది సెల్ ఫోన్లు తీసుకొస్తే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి గదిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రపరచాలని సూచించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కంట్రోల్ రూం పనిచేస్తుందని పేర్కొన్నారు.