ఉరి వేసుకుని ఎస్ ఐ ఆత్మహత్య

ఉరి వేసుకుని ఎస్ ఐ ఆత్మహత్య

వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : ములుగు జిల్లా వాజేడు లో సీఆర్పీఎఫ్ ఎస్సై జెడ్ ఎల్ ఠాక్రే (56) ఉరేసుకుని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. వాజేడు పోలీస్ స్టేషన్ క్యాంప్ లోని సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ ‘సీ’-కంపెనీకి చెందిన ఎస్సై ఉదయం 9 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన స్వస్థలం మహారాష్ర్ట. 1986 బ్యాచ్. వ్యక్తిగత కారణాల వలన క్యాంప్ లోని తన రూమ్ లో ఫ్యాన్ కి ఉరివేసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై కేసు నమోదు చేసి, వారి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వం ఏటూర్ నాగారానికి తరలించారు.ఉరి వేసుకుని ఎస్ ఐ ఆత్మహత్య