నాగరాజుని హత్యచేసిన దుండగులను శిక్షించాలి

నాగరాజుని హత్యచేసిన దుండగులను శిక్షించాలి

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ఇనుపరాడ్లతో కొట్టి చంపిన దుండగులను కఠినంగా శిక్షించాలని కాకతీయ యూనివర్సిటీ ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ (AMSA KU) అధ్యక్షులు డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. చెల్లి మతాంతర వివాహం చేసుకుందని కోపంతో హైదరాబాద్ సరూర్ నగర్ లో నడిరోడ్డు పై అతి కిరాతకంగా దళిత కులానికి చెందిన నాగరాజును కొందరు దుండగులు హత్య చేసిన ఘటన తెలిసిందే. యూనివర్సిటీ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.నాగరాజుని హత్యచేసిన దుండగులను శిక్షించాలిదేశంలో, రాష్ట్రంలో రోజురోజుకూ పరువు హత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. దళితులకు రక్షణ లేకుండా పోతుందని, ప్రణయ్ హత్య మరవకముందే మళ్లీ నాగరాజుని హత్య చేయటం దారుణమని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కులాంతర మతాంతర వివాహం చేసుకోవాలని అలాంటప్పుడే సమాజంలో కులం, మతం అంతరించిపోతాయని అన్నారు.ప్రభుత్వాలు కూడా కులాంతర వివాహం చేసుకున్న వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని కోరారు.

జనసమూహం మధ్యలో ఒక వ్యక్తిని దారుణంగా చంపుతుంటే చుట్టుపక్కల ప్రజలు కనీసం స్పందించకపోవడం, ఆపక పోవడం సిగ్గుచేటని అన్నారు. నాగరాజుని చంపిన వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగరాజు భార్యకు ప్రభుత్వ ఉద్యోగము, నాగరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి హత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొంగర జగన్మోహన్, డాక్టర్ చందు, రాజశేఖర్, సురేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.