ఐపీఎల్ లో మూడేళ్ల తర్వాత ముగింపు వేడుకలు

ఐపీఎల్ లో మూడేళ్ల తర్వాత ముగింపు వేడుకలు

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : ఐపీఎల్ 2022 ప్రస్తుతం కొద్ది మంది ప్రేక్షకుల మధ్య నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముంబై, పూణే స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. ఐతే ఈ యేడాది ఐపీఎల్ ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. మూడేళ్ల తర్వాత ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ లో మూడేళ్ల తర్వాత ముగింపు వేడుకలుకరోనా వల్ల గడిచిన రెండేళ్ల ఐపీఎల్ లో ఎటువంటి వేడుకను నిర్వహించలేదు. అయితే ఈ యేడాది ముగింపు సెర్మనీ నిర్వహణకు సంబంధించిన బిడ్ లను బీసీసీఐ ఆహ్వానించింది. దీనికి సంబంధించిన ప్రకటనను ఐపీఎల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆసక్తి గల వారు ముగింపు వేడుకల నిర్వహణకు బిడ్డింగ్ వేయాలని ఓ లేఖలో బీసీసీఐ కార్యదర్శి షా కోరారు.