27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం

27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఏప్రిల్ 27న మాదాపూర్ లోని హెచ్ ఐసిసిలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఉదయం 10 గంటలకల్లా పార్టీ ప్రతినిధులందరూ సమావేశ మందిరానికి చేరుకోవాలని సీఎం కోరారు.27న టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవంవ్యవస్థాపక దినోత్సవంలో హాజరయ్యే ప్రజా ప్రతినిధులు :
రాష్ట్ర మంత్రి వర్గం, రాజ్యసభ, లోక్ సభ, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబి, డీసీఎంఎస్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మహిళా కో ఆర్డినేటర్లు, జెడ్పీటిసీ సభ్యులు, మున్సిపల్ మేయర్లు మరియు చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, పట్టణాల మరియు మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొంటారు.

ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు.

కార్యక్రమ నిర్వహణ వివరాలు :
*ఏప్రిల్ 27 బుధవారం ఉదయం 10 గంటలకల్లా ప్రతినిధులందరూ హైద్రాబాద్ మాదాపూర్ నందుగల హెచ్ ఐ సిసి సమావేశమందిరానికి చేరుకోవాలి.
*ఉచయం 10 గంటలనుంచి 11 గంటల వరకు ప్రతినిధుల నమోదు.
*ఉదయం 11:05 గంటలకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ఆగమనం.
*పార్టీ పతాకావిష్కరణ.
*స్వాగతోపన్యాసం
*అధ్యక్షుల వారి తొలిపలుకులు
*దాదాపు 11 తీర్మానాలు ప్రవేశపెట్టడం
*వాటి పై చర్చించి ఆమోదించడం.