18న సికింద్రాబాద్-తిరుపతి మధ్య స్పెషల్ రైలు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 18న సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రత్యేక రైతు నడపనున్నట్లు దక్షిణ మధ్యరైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ స్టేషన్ లో 18న సాయంత్రం 6 :10 గంటలకు ప్రత్యేక రైలు (07588) బయల్దేరనుంది. తర్వాత రోజు ఉదయం 7 :10 గంటలకు తిరుపతి చేరుకోనుంది.సికింద్రాబాద్ -తిరుపతి వెళ్లే ప్రత్యేక రైలు బేగంపేట్, లింగంపల్లి, శంకర్ పల్లి, వికారాబాద్, చిట్టాపూర్, రాయిచూర్ , మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్ , గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్, కోడూరు, రేణిగుంట స్టేషన్ లో ఆగనుంది. ఈ ప్రత్యేక రైలులో ఏసీ 2 టైర్, ఏసీ3 టైర్ , స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉండనున్నాయి.