ప్రారంభమైన భారత్ గౌరవ్ పర్యాటక రైలు

ప్రారంభమైన భారత్ గౌరవ్ పర్యాటక రైలు

ప్రారంభమైన భారత్ గౌరవ్ పర్యాటక రైలుwarangal times, కాజీపేట : యాత్రికులు పుణ్యక్షేత్రాల దర్శనాలకు భారత్ గౌరవ్ పర్యాటక రైలు శనివారం సికింద్రాబాద్ నుండి ప్రారంభమైంది. ఆరు ఏసీ భోగీలు, 9 స్లీపర్ క్లాస్ కలిగిన ఈ రైలు సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి 1.40నిమిషాలకు కాజీపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా కాజీపేటలో రిజర్వేషన్ చేసుకున్న 69 మంది యాత్రికులను స్థానిక రైల్వే అధికారులు, భారత్ రోవర్స అండ్ రేంజర్స్ స్వాగతం పలికారు. అనంతరం డప్పు మేళాలతో యాత్రికులను వారికి సంబంధించిన రిజర్వేషన్ బోగిల వద్దకు సాగనంపారు. అనంతరం స్థానిక రైల్వే అధికారులు మాట్లాడుతూ ఈ రైలు సికింద్రాబాద్ నుండి పూరి, కాశి మీదుగా అయోధ్యకు చేరుకుంటుందని తెలిపారు.ప్రారంభమైన భారత్ గౌరవ్ పర్యాటక రైలుదిగువ శ్రేణిలో ప్రయాణించేందుకు ఒక్కరికి రూ.18000, ఏసీ ఫస్ట్ క్లాస్ 28000, మూడో తరగతి ఎసి స్లీపర్ క్లాస్ లో రూ. 22000 చార్జి ఉంటుందని అందులో భాగంగానే యాత్రికులకు భోజనము వసతి సౌకర్యము ఉంటుందని తెలిపారు. కాజీపేట ఆర్పిఎఫ్ సిఐ సంజీవరావు మాట్లాడుతూ ఈ యాత్ర స్పెషల్ లో యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ప్రతి బోగీలో ఇద్దరు కానిస్టేబుల్ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. అనంతరం ఈ రైలు కాజీపేట మీదుగా ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, విశాఖపట్నం విజయనగరం మీదుగా పూరి వెళుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీజిల్ లోకో షెడ్ డి ఎం ఈ హనుమాన్ నాయక్, ఏడీఎంఈ భాను ప్రకాష్, సి టి ఐ విజయ్ కుమార్, జి ఆర్ పి ఎస్ ఐ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.