భార్యను గొంతు నులిమి చంపి భర్త పరార్

భార్యను గొంతు నులిమి చంపి భర్త పరార్

వరంగల్ టైమ్స్, ప్రకాశం జిల్లా : కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన జె. పంగులూరు మండలం రామకూరు గ్రామంలో చోటుచేసుకుంది. రేణింగవరం ఎస్సై తిరుపతిరావు ఇచ్చిన సమాచారం మేరకు పావులూరు నాగ సునీత, లక్ష్మీనారాయణ దంపతులు. అయితే అనుమానంతో లక్ష్మీనారాయణ తరచూ భార్యతో గొడవలు పడుతుంటాడు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ ఎక్కువై భార్యను చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. భార్య సునీతను చంపి మంచంపై పడేసి, భర్త పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.