ఓటీఆర్ ఎడిట్ కోసం టీఎస్ పీఎస్సీలో హెల్ప్ డెస్క్

ఓటీఆర్ ఎడిట్ కోసం టీఎస్ పీఎస్సీలో హెల్ప్ డెస్క్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో ఉద్యోగ ప్రకటనలు వెలువడుతున్న నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) ఎడిట్ ను సులభతరం చేసింది. ఐడీ మర్చిపోయినా, అప్పటి ఫోన్ నంబర్ ప్రస్తుతం వాడుకలో లేకపోయినా తమను సంప్రదిస్తే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించింది. హెల్స్ డెస్క్ నంబర్ 040 – 22445566 ను సంప్రదిస్తే వివరాలు తెలుపనున్నట్లు ప్రకటించింది.ఓటీఆర్ ఎడిట్ కోసం టీఎస్ పీఎస్సీలో హెల్ప్ డెస్క్ఉదయం 10. 30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని సూచించింది. లేదా [email protected] ఈ-మెయిల్ కు వివరాలు పంపించినా సమస్యకు పరిష్కారం చూపుతామని వెల్లడించింది. అభ్యర్థులు నేరుగా నాంపల్లిలోని టీఎస్ పీఎస్సీ ఆఫీస్ కు వెళ్లి లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకొన్నా అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. అభ్యర్థులు జాగ్రత్తగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని టీఎస్ పీఎస్సీ సూచించింది.

వివరాల నమోదు సమయంలో పొరపాట్లు జరిగితే ఉద్యోగ ప్రకటన దరఖాస్తులోనూ అవే పునరావృతం అవుతాయని హెచ్చరించింది. దరఖాస్తు పూర్తి చేసిన తర్వాత ప్రివ్యూ కోసం 3 నిమిషాల సమయం ఉంటుందని, ఆలోపు మరోసారి పరిశీలించి పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలని వివరించింది. రిజిస్ట్రేషన్, ఎడిట్ సమయంలో ఏమైనా సందేహాలుంటే హెల్ప్ డెస్క్ కు కాల్ చేస్తే వెంటనే పరిష్కారం లభిస్తుందని సూచించింది.