టోకెన్లు పొందిన భక్తులకు ఏప్రిల్ 12న దర్శనం

టోకెన్లు పొందిన భక్తులకు ఏప్రిల్ 12న దర్శనం

వరంగల్ టైమ్స్, తిరుపతి : తిరుపతిలోని కౌంటర్లలో నేడు సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఏప్రిల్ 12 మంగళవారం నాటికి దర్శన స్లాట్ లభిస్తుందని టీటీడీ పేర్కొన్నది. మంగళవారం నాటి స్లాట్ పూర్తి కాగానే టోకెన్ల జారీ నిలిపివేయడం జరుగుతుంది. భక్తుల అధిక రద్దీ కారణంగా బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లు ఒక రోజు ముందు అనగా మంగళవారం మధ్యాహ్నం నుండి తిరుపతిలోని ఆయా కౌంటర్లలో కేటాయించడం జరుగుతుంది. కాగా, ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లు కేటాయించబడవు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోలరని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది.