చల్లా ఆధ్వర్యంలో గులాబీ వైపు హస్తం అడుగులు
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : తెలంగాణలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల పాలనకు, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న ఇతర పార్టీలకు చెందిన వారు కారు ఎక్కేందుకు ఆసక్తి చూపుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పరకాల నియోజకవర్గం నడికూడ మండలం కేంద్రంలో సుమారు వంద మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేశారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఎమ్మెల్యే ఆహ్వానించారు.కాంగ్రెస్ పార్టీకి పార్టీలో చేరిన వారిలో దుప్పటి సుధాకర్, నీరటి రాములు, దుప్పటి సదానందం, దుప్పటి సదానందం, న్యాతకాని నవీన్, డొంతుల రాజేందర్, సంఘాల విజేందర్, దుప్పటి కృపాకర్, దుప్పటి ఐలయ్య, దుప్పటి రాజేందర్, కామిద్రి సుదర్శన్, దుప్పటి ప్రవీణ్, రమేష్, సంఘాల రమేష్, గొల్ల సందీప్, దుప్పటి మల్లేష్, పాసుల మధుకర్ లతో పాటు సుమారు వంద మందికి పైగా చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి, సర్పంచ్ ఊర రవీందర్ రావు, ఎంపీటీసీ ఏ.చేరాలు, సొసైటీ డైరెక్టర్ ఊర సతీష్, నాయకులు దుప్పటి పవన్, నారగాని ఐలయ్య, వీరమళ్ళ మల్లారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ నారగాని, కార్యదర్శి రావుల కిషన్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.