క్రిస్మస్ గిఫ్ట్ లు అందచేసిన మంత్రి తలసాని

క్రిస్మస్ గిఫ్ట్ లు అందచేసిన మంత్రి తలసానిహైదరాబాద్: క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించి ఘనంగా జరుపుకుంటారని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ ఎస్పీజీ చర్చిలో, అమీర్ పేట డివిజన్ వివేకానంద కమిటీ హాల్ లో కార్పొరేటర్ లు ఆకుల రూప, నామన శేషుకుమారిలతో కలిసి క్రిస్మస్ గిఫ్ట్ లను అందజేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25 వ తేదీన ప్రపంచంలోని కోట్లాది మంది క్రైస్తవులు క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఏసు సూక్తులు అనేకం మానవుడి జీవన విధానం ఏ విధంగా ఉండాలో తెలియజేస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు తమతమ పండుగలను ఘనంగా జరుపుకోవాలని, ఆనందంగా జీవించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం అన్నారు. సీఎం ఆలోచనలలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల పండుగలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వరంలో ప్రజలు వైభవంగా నిర్వహించుకుంటున్నట్లు వివరించారు. క్రైస్తవులందరికీ మంత్రి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ ముకుందరెడ్డి, బిషప్ ఆశీర్వాదం, ఫాదర్ జాన్సన్, హెన్రీ, రాజు, నరేందర్, హరి, అమీర్ పేటలో డీఎంసీ వంశీ, డీపీఓ సంధ్య, క్రిస్టియన్ పెల్లోషిప్ చర్చి ఫాస్టర్ శీబా, హెన్రీ రిచర్డ్స్, జాకోబ్, మోసిన్, సోలమన్, సుదర్శన్, సురేష్, TRS నాయకులు రాజారెడ్డి, విజయ, దుర్గం అశోక్ యాదవ్, ఉమానాద్ గౌడ్, కూతురు నరసింహ, అనిల్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.