రైనా, గురు రంధ్వానా అరెస్టు

రైనా, గురు రంధ్వానా అరెస్టు

ముంబై : క్రికెటర్ సురేశ్ రైనాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడితో పాటు సింగర్ గురు రంధ్వానాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై ఎయిర్ పోర్టుకు సమీపంలోని డ్రాగన్ ప్లే క్లబ్‌పై ఆకస్మిక దాడి చేసిన పోలీసులు వీరిద్దరితో పాటు మరో 34 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు క్లబ్ సిబ్బంది కూడా ఉన్నారు. కరోనా నిబంధనలను అతిక్రమించినందుకు గానూ వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. నిర్ధారిత సమయం కంటే ఎక్కువ సేపు తెరిచి ఉండడంతో పాటు, కరోనా నిబంధనలు పాటించని నేపథ్యంలో డ్రాగన్ ఫ్లై క్లబ్‌పై రైడ్ చేసి 34 మందిని అరెస్టు చేశామని సహర్ పోలీస్‌ స్టేషన్‌ సీనియర్ ఇన్‌స్పెక్టర్తెలిపారు. అరెస్టైన వారిలో క్రికెటర్ సురేశ్ రైనా, సింగర్ గురు రంధ్వానా కూడా ఉన్నారన్నారు. ఏడుగురు హోటల్ సిబ్బందిని కూడా అరెస్టు చేశామని చెప్పారు. వారిపై ఐపీసీ సెక్షన్ 188, 269, 34 ప్రకారం కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఇదిలా ఉంటే అరెస్టైన కొద్ది సేపటికే సురేశ్ రైనా, గురు రంధ్వానాలు బెయిల్‌పై విడుదలయ్యారు.