చై- సామ్ ల వివాహ బంధానికి బ్రేక్

చై- సామ్ ల వివాహ బంధానికి బ్రేక్

వరంగల్ టైమ్స్ , హైదరాబాద్ : చై- సామ్ లపై టాలీవుడ్ లో వరుసగా వస్తున్న రూమర్స్ కు బ్రేక్ పడింది. యంగ్ హీరో నాగచైతన్య, సమంతలు వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా తమ విడాకుల స్టేట్మెంట్ ను విడుదల చేశారు. ఇద్దరం ఒకరికి ఒకరం దూరం ఉండాలనుకుంటున్నట్లు వెల్లడించారు.చై- సామ్ ల వివాహ బంధానికి బ్రేక్సమంతతో సంప్రదింపుల తర్వాత ఇద్దరం వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నామని నాగచైతన్య తన ట్వీట్ లో తెలిపారు. తమ కెరీర్ లపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు నాగ చైతన్య తెలిపాడు.దాదాపు పదేళ్ల కాలం పాటు తమ మధ్య స్నేహం కొనసాగిందని, అదే తమ మధ్య బంధాన్ని బలపరిచినట్లు చైతన్య తెలిపాడు. అది ఎప్పటికీ మరువలేనిదన్నాడు. క్లిష్టతరమైన సమయంలో అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, మీడియా సహకరించాలని నాగ్ తన ట్వీట్ లో కోరాడు. తమకు ప్రైవసీ ఇవ్వాలని వేడుకున్నాడు. సమంత కూడా తన ట్విట్టర్ లో నాగ్ తో విడిపోతున్నట్లు స్పష్టం చేసింది.