ఇల్లు లేని వారికి టీ సర్కార్ గుడ్ న్యూస్ 

ఇల్లు లేని వారికి టీ సర్కార్ గుడ్ న్యూస్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సొంత జాగా ఉండి ఇల్లు లేని వారికి తెలంగాణ రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. దీనికోసం రూ.7,890 కోట్లు కేటాయించినట్లు బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు ప్రతీ నియోజకవర్గంలో 2 వేల మందికి రూ. 3లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు.

సీఎం కోటాలో 25 వేల మందికి రూ. 3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మొత్తంగా 2 లక్షల 63వేల మందికి 7890 కోట్లు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇక డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం రూ. 12 వేల కోట్లు కేటాయించారు.