ఏయూపై సీఎంకు ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదు

ఏయూపై సీఎంకు ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదు

ఏయూపై సీఎంకు ఏఐఎస్ఎఫ్ ఫిర్యాదు

వరంగల్ టైమ్స్, విశాఖపట్నం : ఆంధ్రా యూనివర్శిటీ యాజమాన్యం చేస్తున్న అక్రమాలపై సీఎం జగన్‌ కు విద్యార్థి యువజన అభ్యుదయ సంఘాల ఐక్యవేదిక బహిరంగ లేఖ రాసింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్డ్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు మాట్లాడారు. ఏయూ వీసీ ఫ్రొఫెసర్ ప్రసాదరెడ్డిని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు వ్యక్తులకు ఏయూ భూములను కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కార్పొరేట్ విద్యా సంస్ధల్లా ఫీజులు వసూలు చేస్తున్నారని, 24 కోర్సులను రద్దు చేశారని మండిపడ్డారు. రూసా నుంచి వచ్చిన రూ. 100 కోట్లు ఏమి చేశారని ప్రశ్నించారు. విద్యార్ధులను భయభ్రాంతులకు గురిచేసే విధానాలు అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎల్.జే నాయుడు మాట్లాడుతూ ఏయూలో నాన్ బోర్డర్స్‌గా ఉన్నవారంతా వైసీపీకి చెందిన వారేనని, వీసీ భవనంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు సాగుతున్నాయని అన్నారు. ఏయూని వైసీపీ కార్యాలయంగా మార్చేశారని విమర్శించారు. 40 శాతం ఫీజులు పెంచి సామాన్య విద్యార్థులపై భారం పెంచుతు‌న్నారని, వీసి నిరంకుశ విధానలపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని ఎల్‌జే నాయుడు వ్యాఖ్యానించారు.