3 రాష్ట్రాల్లో 3 స్థానాలకు..మే 31న బై పోల్స్

3 రాష్ట్రాల్లో 3 స్థానాలకు..మే 31న బై పోల్స్

వరంగల్ టైమ్స్, న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల్లో మూడు స్థానాలకు ఉపఎన్నికల కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఉత్తరాఖండ్, ఒడిశా, కేరళలో ఖాళీ అయిన మూడు అసెంబ్లీ స్థానాలకు మే 31న ఉపఎన్నికలు జరుగుతాయని సోమవారం వెల్లడించింది. జూన్ 3న ఫలితాలుంటాయని పేర్కింది. ఒడిశాలోని బ్రజరాజ్ నగర్, కేరళలోని త్రిక్కకర, ఉత్తరాఖండ్ లోని చంపావత్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను సోమవారం విడుదల చేసింది. ఈనెల 4న నోటిఫికేషన్ ను ఈసీ విడుదల చేస్తుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ మే11, 12న స్క్రూటీనీ కాగా, నామినేషన్ల ఉపసంహరణకు మే 16 చివరి తేదీ. మే 31 మంగళవారం పోలింగ్, జూన్ 3న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. జూన్ 5 నాటికి ఉపఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.3 రాష్ట్రాల్లో 3 స్థానాలకు..మే 31న బై పోల్స్మూడు రాష్ట్రాల్లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈ యేడాది జనవరి వరకు ప్రచురించిన ఓటర్ లిస్టును పరిగణలోకి తీసుకుంటామని ఈసీ తెలిపింది. అలాగే ఈవీఎంల ద్వారానే ఉపఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలతో మోడల్ కోడ్ వెంటనే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. మరోవైపు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన సీఎం పుష్కర్ సింగ్ ధామి తన అదృష్ట్యాన్ని పరీక్షించుకోనున్నారు. చంపావత్ అసెంబ్లీ స్థానం నుంచి ఉపఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నారు.

 

చంపావత్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ చంద్ర గహటోడి రాజీనామా చేయడంతో ఈ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఓడిపోయినా ఆ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. దీంతో బీజేపీ అధిష్ఠానం మరోసారి సీఎంగా పుష్కర్ సింగ్ ధామికి అవకాశం ఇచ్చింది.