టెన్త్, ఇంటర్ తో బీఎస్ఎఫ్ లో ఉద్యోగాలు
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సరిహద్దు భద్రతా దళం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కల్గినవారు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 281 పోస్టులను భర్తీ చేయనున్నది. ఇందులో మాస్టర్, డ్రైవర్, వర్క్ షాప్ విభాగాల్లో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ పోస్టులున్నాయి. టెన్త్ , ఇంటర్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం పోస్టులు : 281, ఇందులో ఎస్సై 16 ( మాస్టర్ 8, ఇంజిన్ డ్రైవర్ 6, వర్క్ షాప్ 2 ), హెడ్ కానిస్టేబుల్ 135 ( మాస్టర్ 52, ఇంజిన్ డ్రైవర్ 64, వర్క్ షాప్ 19), సీటీ 130 చొప్పున ఖాళీలున్నాయి.
అర్హతలు : టెన్త్, ఇంటర్ పాసవ్వాలి. ఎస్సై ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు మెకానికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా లేదా డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థులు 22 నుంచి 28 యేండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం : ఆన్లైన్ లో. ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఈ నెల 21న ప్రకటన విడుదలైంది. ప్రకటన విడుదలైన 30 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : రూ. 200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 20
వెబ్ సైట్ : https://rectt.bsf.gov.in