వెల్ఫేర్ హాస్టళ్లలో 581 పోస్టులకు నోటిఫికేషన్
వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు కొనసాగుతున్నాయి. డిసెంబర్ లో టీఎస్పీఎస్సీ ఉద్యోగ భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. గురువారమే 185 వెటర్నరీ సర్జన్, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ శుక్రవారం సంక్షేమ హాస్టళ్లలో 581 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో అత్యధికంగా 549 హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలున్నాయి. వార్డెన్ 8, మ్యాట్రన్ 5, లేడీ సూపరింటెండెంట్ పోస్టులు 19 ఉన్నాయి.
దీంతో పాటు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2లో మొత్తం 140 ఉద్యోగాలున్నాయి. ఇందులో ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ లో 87, పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ లో 14, ప్రీ మెట్రిక్ గర్ట్స్ హాస్టల్ లో 26, పోస్ట్ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ లో 13 పోస్టులున్నాయి. ఈ ఉద్యోగాలకు జనవరి 6 నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెల్పారు. ఆన్లైన్ దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in వెబ్ సైట్ లో సంప్రదించాలని సూచించారు.
ఉద్యోగాల వివరాలు…
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1 ( ట్రైబల్ వెల్ఫేర్) : 5
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 (ట్రైబల్ వెల్ఫేర్) : 106
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్- 2 మేల్ ( ఎస్సీ డెవలప్మెంట్ ) : 228
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 ఫిమేల్ (ఎస్సీ డెవలప్మెంట్) : 70
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -2 ( బీసీ వెల్ఫేర్ ) : 140
లేడీ సూపరింటెండెంట్ చిల్డ్రన్ హోం ( ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ) : 19
వార్డెన్ గ్రేడ్ -1 ( డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ) : 05
మ్యాట్రన్ గ్రేడ్-1 ( డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ) : 03
వార్డెన్ గ్రేడ్ -2 ( డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ) : 03
మ్యాట్రన్ గ్రేడ్-2 ( డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ ) : 02