రోడ్డు ప్రమాదం.. అయ్యప్ప భక్తులు మృతి 

రోడ్డు ప్రమాదం.. అయ్యప్ప భక్తులు మృతి

వరంగల్ టైమ్స్, చెన్నై : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో శబరిమల భక్తులు మరణించారు. తేని జిల్లాలో సుమారు 50 ఫీట్ల లోతులో భక్తులు ప్రయాణిస్తున్న కారు పడిపోయింది. ఈ ఘటనలో 8 మంది అయ్యప్ప భక్తులు మరణించారు. కుములి ఘాట్ సెక్షన్ లో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. శబరిమల ఆలయంలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం చేస్తున్న భక్తులు ఈ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులతో పాటు మరో ఏడేళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డారు. ఆ ముగ్గురిని తేజి జిల్లా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.