తెలంగాణలో ప్రారంభమైన టెన్త్ ఎగ్జామ్స్  

తెలంగాణలో ప్రారంభమైన టెన్త్ ఎగ్జామ్స్

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు నేడు ప్రారంభమయ్యాయి. రెండేండ్ల తర్వాత రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగనున్నాయి.తెలంగాణలో ప్రారంభమైన టెన్త్ ఎగ్జామ్స్  రాష్ట్రంలో మొత్తం 5 లక్షల 9వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.ఇందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా హాల్ లోకి 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని అధికారులు తెలిపారు.