శబ్ధ కాలుష్యంపై స్పెషల్ డ్రైవ్

శబ్ధ కాలుష్యంపై స్పెషల్ డ్రైవ్

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్‌ను శబ్ధ కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు తమ వంతు చర్యలు చేపట్టారు. నిషేధిత ఎయిర్ హారన్లు, ప్రెషర్ హారన్లు, మల్టీ-టోన్ హారన్లు వినియోగించే వారిపై రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేయనున్నారు. మే 10 నుంచి నగరంలో నిషేధిత హారన్ల వల్ల ఏర్పడే శబ్ద కాలుష్యంపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. నిషేధిత మల్టీ టోన్‌ హారన్‌లు, ఎయిర్‌ హారన్‌లు వాడినందుకు 3,320 మంది వాహనదారులపై హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిపై రూ. 1,000 జరిమానా విధించారు. నిషేధిత హారన్లను తొలగించారు.శబ్ధ కాలుష్యంపై స్పెషల్ డ్రైవ్జూన్ 1 నుంచి ఇలాంటి హారన్లు వినియోగించే డ్రైవర్లు, వాహన యజమానులపై చార్జ్ షీట్లు కూడా దాఖలు చేయబడతాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాంటి వాహనాల యజమానులపై కోర్టులో చార్జిషీట్లు దాఖలు చేస్తామని జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. జూన్ నుంచి వారు ప్రాసిక్యూషన్‌ను కూడా ఎదుర్కొంటారని చెప్పారు. సెంట్రల్ మోటర్ వెహికల్స్ రూల్స్- 1989 ప్రకారం చర్యలు ముమ్మరం చేయనున్నారు.