ఏఈఈ పోస్టుల రాతపరీక్షకు సర్వం సిద్ధం

ఏఈఈ పోస్టుల రాతపరీక్షకు సర్వం సిద్ధం

వరంగల్ టైమ్స్, ఎడ్యుకేషన్ డెస్క్ : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 1540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈ నెల 22న నిర్వహించనున్నారు. ఈ రాతపరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు జిల్లాల్లోని 176 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30వరకు పేపర్‌-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌- 2 పరీక్ష ఉంటుందని వివరించారు.

పరీక్ష కేంద్రంలోకి వచ్చేందుకు పేపర్‌-1కు ఉదయం 8.30నుంచి 9.45వరకు, పేపర్‌-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15నుంచి 2.15వరకే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఆ తరవాత గేట్లు మూసివేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు.