ఓరుగల్లుకు ట్రబుల్ షూటర్? 

ఓరుగల్లుకు ట్రబుల్ షూటర్?

ఓరుగల్లుకు ట్రబుల్ షూటర్? 

వరంగల్ టైమ్స్, టాప్ స్టోరీ : ఖమ్మం సభ సూపర్ సక్సెస్ అయిన తర్వాత మంత్రి హరీశ్ రావుకు మరింత కీలక బాధ్యతలు అప్పజెప్పాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారట. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలు హరీశ్ రావుకే అప్పజెప్పే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు టాక్. ఖమ్మంతో పాటు హాట్ హాట్ గా ఉన్న ఓరుగల్లు పాలిటిక్స్ లోకి ట్రబుల్ షూటర్ వస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

కొంతమంది ఎమ్మెల్యేలను మార్చాలని ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల గళమెత్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సదరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే ఆయన ఈ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారన్న అనుమానాలు వ్యక్తమమవుతున్నాయి. దీంతో ఆ ఎమ్మెల్యేలకు, ఎర్రబెల్లికి మధ్య కోల్డ్ వార్ మొదలైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం.

*ట్రబుల్ షూటర్ కు ఓరుగల్లు టాస్క్ ఫలించేనా..
ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోట. అలాంటి చోట ఇలాంటి ఇంటర్నల్ వార్ పార్టీకి నష్టం చేస్తుందని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు ఓరుగల్లు బాధ్యతలు అప్పజెప్పాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కొందరు జిల్లా ఎమ్మెల్యేలు కూడా హరీశ్ రావు అయితేనే బెటర్ అని కూడా సీఎం కేసీఆర్ దగ్గర ప్రతిపాదించినట్లు టాక్. అయితే ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ అంత సుముఖంగా లేరని ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యతలతో పాటు ఓరుగల్లు టాస్క్ కూడా ఇస్తే హరీశ్ రావుపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ఈ ఒక్క కారణంతో కేసీఆర్ వెనుకాడుతున్నట్లు టాక్. అయితే హరీశ్ రావుకు ఉన్న సామర్థ్యానికి ఇది అంత పెద్ద భారం కాదని ఓరుగల్లు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ ను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారట. దీనికి కేసీఆర్ అంగీకరించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఒక్కటి మాత్రం స్పష్టం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చాటాలంటే నేతలంతా విభేదాలు పక్కన బెట్టాలి. అప్పుడే గత ఎన్నికల్లోలాగా మరోసారి గులాబీ గుబాళిస్తుంది. లేదంటే పార్టీ నష్టపోవడం ఖాయం. అందుకే కేసీఆర్ కూడా ట్రబుల్ షూటర్ నే నమ్ముకోవచ్చని టాక్. ఉమ్మడి ఓరుగల్లు బాధ్యతలు హరీశ్ రావుకు అప్పజెప్పడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది.

* ఓరుగల్లు పాలిటిక్స్ హరీష్ రావుతోనే చక్కబడుతాయా
మంత్రి ఎర్రబెల్లి, వినయ్ భాస్కర్, కడియం, రాజయ్య, గండ్ర, రెడ్యా నాయక్, శంకర్ నాయక్, సత్యవతి రాథోడ్ లాంటి హేమాహేమీలను కలుపుకుని పోవాలంటే బలమైన నాయకుడు కావాలి. అది హరీశ్ రావు లాంటి వారితోనే సాధ్యం. అందుకే ఇక వరంగల్ పాలిటిక్స్ కు ట్రబుల్ షూటర్ రావడం పక్కా అని గులాబీ శ్రేణులు బల్లగుద్ది చెబుతున్నారు. మరి నిజంగానే హరీశ్ రావు ఓరుగల్లు పాలిటిక్స్ ను చూసుకుంటారా? ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర పోషిస్తారా? ఎర్రబెల్లి చెబుతున్నట్లు కొందరు ఎమ్మెల్యేలను మార్చడానికి హరీశ్ రావు కూడా అంగీకరిస్తారా? అన్నది వేచిచూడాలి!!