రేపే కొత్త డీజీపీ అంజనీ కుమార్ బాధ్యతలు 

రేపే కొత్త డీజీపీ అంజనీ కుమార్ బాధ్యతలు

రేపే కొత్త డీజీపీ అంజనీ కుమార్ బాధ్యతలు 

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్ శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఇక ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో మహేందర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 8.25 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మహేందర్ రెడ్డి ఐపీఎస్ గా 36 యేండ్ల పాటు సుదీర్ఘ సేవలందించారు. పోలీసు శాఖలో సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు తెచ్చారు మహేందర్ రెడ్డి.