11న సైబర్ నేరాల నిరోధంపై స్టూడెంట్స్ కి శిక్షణ

11న సైబర్ నేరాల నిరోధంపై స్టూడెంట్స్ కి శిక్షణ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మహిళా భద్రతా విభాగం, తెలంగాణ రాష్ట్రం సైబర్ అవేర్ నెస్ ఇనిషియేటివ్ సైబర్ లో భాగంగా రాష్ట్రంలోని 9424 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నది. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల నివారణపై అవగాహన, ఆన్‌లైన్‌ సేఫిటీ పొందేందుకై ఆరునెలల పాటు ప్రత్యేక శిక్షణను నివ్వనుంది. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని 2381 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 9424 మంది పిల్లలు, టీచర్లకు C.A.P(సైబర్ అవగాహన వేదిక) పేరుతో ఇస్తున్న 6 నెలల సుదీర్ఘ శిక్షణ కార్యక్రమం ఇది.11న సైబర్ నేరాల నిరోధంపై స్టూడెంట్స్ కి శిక్షణఈ కార్యక్రమాన్ని బుధవారం నాడు ఉదయం రవీంద్ర భారతీలో రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్ర రెడ్డి, డీజీపీ అంజనీ కుమార్ లు ప్రారంభించనున్నారు. పాఠశాల విద్యా శాఖ, మహిళా భద్రత విభాగంచే సంయుక్తంగా నిర్వహించే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం జనవరి 11న ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర పోలీసు , విద్య , బీసీ , ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు, టీఎస్ షీ టీంలతో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి పాఠశాల విద్యార్థులు మరియు వివిధ కళాశాలల నుండి సేఫ్టీ క్లబ్ వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.