వరంగల్ పోలీసులతో తప్పించుకోలేరు

వరంగల్ పోలీసులతో తప్పించుకోలేరు

వరంగల్ అర్బన్: కరోనా వైరస్ కారాణంగా దేశవ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే  లాక్ డౌన్ ఉండడంతో చాలా మంది ఇంటికే పరిమితమవుతున్నారు. మరి కొందరు కుటుంబ సభ్యులతో కాలాన్ని గడుపుతున్నారు. ఉద్యోగులు వర్క్ ఫ్రం ‎హోం చేస్తున్నారు. ఇది ఇలా వుంటే కొందరు యువత మాత్రం దీనికి భిన్నంగా తయారవుతున్నారు. వరంగల్ నగరంలో చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి సమాచారం తెలుసుకున్న మిల్స్ కాలనీ పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో  కొందరు  యువకులు పెకాట ఆడుతున్నవారిని అదుపులోకి పలుమార్లు తనిఖీలు నిర్వహించారు.వరంగల్ పోలీసులతో తప్పించుకోలేరుతనిఖీల్లో అనేక సార్లు పేకాటరాయుళ్ళు పోలీసులకు చిక్కారు. కొన్ని సందర్భాల్లో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పేకాటరాయుళ్ళు పోలీసులకు ఎదురుతిరిగిన సందర్భాలూ వున్నాయి. లాక్ డౌన్ మొదటి నుంచి పలుఐప్రాంతాల్లో ఈ తంతు కొనసాగుతూనే వుంది. ఇందులో భాగంగానే  బుధవారం సాయంత్రం శివనగర్ లోని గవర్నమెంట్ స్కూల్ వెనుక ఎనిమిది మంది యువకులు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది,  దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని  అదుపులోకి తీసుకొన్నారు, వారి వద్ద నుంచి నగదు రూ.13,200, 6-మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకొని, వారిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఇలా కఠిన చర్యలు చేపడుతున్నా చట్ట విరుద్ధంగా నడుచుకునే యువత మాత్రం తమ వంకరపోకడలను మానుకోవడం లేదు. లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది తిండి తిప్పలు దొరకక ఆకలితో అలమటిస్తుంటే పేకాటరాయుళ్ళు మాత్రం పచ్చనోట్లతో పందెం కాసుకుని పేకాటలో మునిగితేలడం సిగ్గుచేటుగా వుంది.

 

నిందితుల వివరాలు:
1. Kalathkar Ganeshan, S/o Anandh rao, age: 33yrs, Occ:Private job, R/o Shivanagar, Warangal,
2.Gade Veera Shivaji, S/o Santhaiah, age:30yrs, Occ: Private job, R/o Shivangar, Warangal,
3.Meesa Srinath, S/o Sathyanarayana, age:29yrs, Occ: Business, R/o Shivanagar, Warangal.
4.Kanthagaai Suresh, S/o Vishwanaadam, age:32yrs, Occ:Gold works, R/o Shivangar, Warangal.
5.Satla Rajesh, S/o Sathyanarayana, age: 30yrs,  Occ: Private job, R/o O-city, Warangal.
6.Santhosh Katkar, S/o Dilip katkar, age: 34yrs, Occ:Gold Smith, R/o RNT road, Warangal.
7.Basani Gopi, S/o Satyanarayana, age:28yrs, Occ:private job, R/o  Perukawada, Warangal.
8.Voram Kranthi Kumar, S/o Laxmaiah, age:32yrs, Occ: Private job, R/o Shivanagar, Warangal,

SHO, MILLSCOLONY