ధర్మపురి క్షేత్రంలో ముక్కోటి వైభవం

ధర్మపురి క్షేత్రంలో ముక్కోటి వైభవం

వరంగల్ టైమ్స్, జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ ఆలయం లో సోమవారం నాడు ముక్కోటి ఏకాదశి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు సోమవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం దర్శనం చేసుకున్నారు. ఆలయంలో స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ దేవుడికి పూజలు చేసి నట్లు మంత్రి చెప్పారు. అనంతరం ధర్మపురి శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వారు రూపొందించి నూతన సంవత్సర క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు.ధర్మపురి క్షేత్రంలో ముక్కోటి వైభవంఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ దంపతులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ దంపతులు, మున్సిపల్ ఛైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, జిల్లా కలెక్టర్ రవి దంపతులు, జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ దంపతులు, జెడ్పీటీసీలు బత్తిని అరుణ, బాదినేని రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేష్, వైస్ చైర్మన్ సునిల్, పాల్గొన్నారు.