స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మెన్ గా ఆంజనేయ గౌడ్ 

స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మెన్ గా ఆంజనేయ గౌడ్

వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఈడిగ ఆంజనేయగౌడ్ ను సీఎం కేసీఆర్ నియమించారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన నియామకపత్రాన్ని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందుకున్నారు.స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మెన్ గా ఆంజనేయ గౌడ్  తనను చైర్మన్ గా నియమించినందుకు సీఎం కేసీఆర్ కు ఆంజనేయగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈడిగ ఆంజనేయ గౌడ్ విద్యార్థి దశ నుంచి విద్యార్థి ఉద్యమాల్లో కీలకంగా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఓయూలో విద్యార్థి నాయకుడిగా ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.