కేసీఆర్ కి ఎమ్మెల్యే చల్లా శుభాకాంక్షలు 

కేసీఆర్ కి ఎమ్మెల్యే చల్లా శుభాకాంక్షలు

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరబాద్ ప్రగతి భవన్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. నూతన సంవత్సరం మరియు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియచేస్తూ పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై కేసీఆర్ తో చల్లా చర్చించారు.కేసీఆర్ కి ఎమ్మెల్యే చల్లా శుభాకాంక్షలు ఆపై నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్ ని కోరినట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్లు చల్లా ధర్మారెడ్డి తెలిపారు. పరకాల నియోజకవర్గ అభివృద్ధికి త్వరలోనే మరిన్ని నిధులు కేటాయిస్తానని హామీ ఇవ్వడంతో సీఎం కేసీఆర్ కి కృతఙ్ఞతలు తెలిపారు.