5వ రోజు రైతుబంధు రూ.265.18 కోట్లు జమ

5వ రోజు రైతుబంధు రూ.265.18 కోట్లు జమ

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నగదు జమఅవుతోంది. 5వ రోజు 1 లక్షా 51 వేల 468 మంది రైతుల ఖాతాల్లో 265.18 కోట్ల నగదు జమ అయింది. 5 లక్షల 30 వేల 371.31 ఎకరాలకు నిధులు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. రైతుల ముఖాల్లో ఆనందం చూడటమే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు. కేవలం 8 యేండ్లలోనే తెలంగాణ వ్యవసాయరంగ స్వరూపం మారిపోయిందన్నారు. రైతుబంధు, రైతు భీమా, ఫ్రీ కరెంట్ పథకాలు చారిత్రాత్మకమైనవని తెలిపారు.5వ రోజు రైతుబంధు రూ.265.18 కోట్లు జమతెలంగాణ పథకాలు చూసి దేశ రైతాంగం బీఆర్ఎస్ వైపు చూస్తున్నదని పేర్కొన్నారు. సంపద పెంచాలి.. ప్రజలకు పంచాలి అన్నదే కేసీఆర్ విధానం అని తెలిపారు. 47.75 లక్షల మందికి ప్రతీ నెల పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. ఇందులో చిన్న, సన్నకారు రైతులు కూడా ఉన్నారని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.