నేటి నుంచి టాస్‌ పరీక్ష ఫీజు చెల్లింపు  

నేటి నుంచి టాస్‌ పరీక్ష ఫీజు చెల్లింపు

వరంగల్ టైమ్స్ , ఎడ్యుకేషన్ డెస్క్ : దూర విద్య ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫీజు చెల్లింపు గడువు ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 18వరకు ఉన్నది. ఈమేరకు తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌(టాస్‌) జాయింట్ డైరెక్టర్ ఎం.సోమిరెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం నుంచి ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు.నేటి నుంచి టాస్‌ పరీక్ష ఫీజు చెల్లింపు  ఆలస్య రుసుం రూ. 25 తో ఈ నెల 25వరకు, రూ. 50 ఆలస్య రుసుంతో ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా మీ సేవ, ఏపీ ఆన్లైన్, టీఎస్ ఆన్లైన్ కేంద్రాల ద్వారానే ఫీజు చెల్లించాలని సూచించారు. డీడీలు, చలాన్ల ద్వారా ఫీజు చెల్లింపులను స్వీకరించబోమని వెల్లడించారు. మే లేదా జూన్ లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.