కందికొండ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

కందికొండ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ యాదగిరి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. వరంగల్లు బిడ్డ కందికొండ మరణం తెలంగాణ సాహిత్య లోకానికి, సబ్బండ వర్గాలకు తీరని లోటని సీఎం అన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపిన వ్యక్తి కందికొండ అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.కందికొండ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతిపాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగంలో తనదైన ముద్రను సృష్టించిన తెలంగాణ బిడ్డ కందికొండ అని కేసీఆర్ స్మరించుకున్నారు. కందికొండ ను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసినా ఫలించక పోవడం దురదృష్టమని సీఎం అవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.