ట్రాలీ ఆటో లారీ ఢీ..ముగ్గురు కూలీలు మృతి

ట్రాలీ ఆటో లారీ ఢీ..ముగ్గురు కూలీలు మృతి

వరంగల్ టైమ్స్ , హనుమకొండ జిల్లా : శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శాయంపేట మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం ఉదయం మహిళా కూలీలతో వెళ్తున్న ట్రాలీని ఓ లారీ ఢీకొట్టింది. దీంటో ట్రాలీలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.ట్రాలీ ఆటో లారీ ఢీ..ముగ్గురు కూలీలు మృతిఅయితే ప్రమాదానికి గురైన బాధిత మహిళలంతా పత్తిపాక గ్రామానికి చెందినవారని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ట్రాలీలో 25 మంది మహిళా కూలీలు ఉన్నారని చెప్పారు. వారంతా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో మిర్చి తోట ఏరడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.