బుద్ధభవన్ కి ఋణపడి ఉంటా : దాస్యం

బుద్ధభవన్ కి ఋణపడి ఉంటా : దాస్యం

వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వరంగల్ జిల్లాలో నిస్వార్థ, నిరాడంబర కమ్యూనిస్టుగా కొనసాగి ప్రజాసమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ, తుది శ్వాస వరకు కమ్యూనిస్టు పార్టీలో కొనసాగిన అరుదైన నేత బీఆర్ భగవాన్ దాస్ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కొనియాడారు. భార‌త రాజ్యాంగ నిర్మాత‌, ద‌ళితుల ఆశాజ్యోతి డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ 132వ జ‌యంతి ఉత్స‌వాల నేప‌థ్యంలో బుద్ధ‌భ‌వ‌న్ అభివృద్ధి క‌మిటీ ప్ర‌తినిధులు రెండ్రోజుల కార్యక్రమాలు నిర్వహించతలపెట్టారు.

కుమార్ పల్లిలో 67 యేళ్ల క్రితం బుద్ధభవన్ నిర్మాణంలో భాగస్వాములైన శ్రామికులు,యువకులు, మహిళలు, భగవాన్ దాస్ సన్నిహితులు, ఆత్మీయులకు అపూర్వ ఆత్మీయ సమ్మేళనంను గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయభాస్కర్ హాజరయ్యారు. నాడు బుద్ధభవన్ నిర్మాణంలో భాగస్వాములైన శ్రామికులు,యువకులు, మహిళలు, భగవాన్ దాస్ సన్నిహితులు, ఆత్మీయులను బుద్ధ‌భ‌వ‌న్ అభివృద్ధి క‌మిటీ ప్ర‌తినిధుల ఆధ్వర్యంలో దాస్యం వినయ్ భాస్కర్ సన్మానించారు. తర్వాత చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ను బుద్ధభవన్ అభివృద్ధి క‌మిటీ ప్ర‌తినిధులు సన్మానించారు.బుద్ధభవన్ కి ఋణపడి ఉంటా : దాస్యం

కుమార్ పల్లి మట్టిపరిమళాలు నా వెన్నంటే ఉన్నాయి : దాస్యం
అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడారు. భగవాన్ దాస్ తో, కుమార్ పల్లితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నిస్వార్థరాజకీయాలకు నిలువెత్తు రూపమైన భగవాన్ దాస్ కి, తమ కుటుంబానికి విడదీయలేని బంధం ఉందని తెలిపారు. తన అన్న క్రీ.శే. దాస్యం ప్రణయ్ భాస్కర్ కి భగవాన్ దాస్ అంటే ఎనలేని ప్రేమ అని గుర్తు చేశారు. తాను రాజకీయ ప్రవేశం చేసిన తొలినాళ్లలో వెన్నుతట్టి ప్రోత్సహించారని గుర్తు చేశారు. కార్మిక పక్షపాతిగా తన ఆచరణలో ఆయన ఆలోచనలు మిళితమై ఉండేవని దాస్యం వినయ్ భాస్కర్ గుర్తుచేశారు.

1999లో స్వతంత్ర అభ్యర్థిగా హనుమకొండ నుంచి పోటీ చేసినప్పుడు భగవాన్ దాస్ అందించిన సహకారం మరిచిపోలేనిదని , ఆయనతో పాటు భగవాన్ దాస్ కుమారులతో కూడా తనకున్న అనుబంధాన్ని చీఫ్ విప్ తెలిపారు. అలాగే తాను రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కుమార్ పల్లి వాసులు తనకు వెన్నంటే ఉన్నారని, గుర్తు ఏదైనా, పార్టీ ఏదైనా ఎన్నికల్లో వ్యక్తిగతంగా తనను గెలిపించుకునేందుకు కుమార్ పల్లి వాసులు కల్మషం లేకుండా నడుస్తున్నారని దాస్యం వినయ్ భాస్కర్ కొనియాడారు. కుమార్ పల్లి మట్టి పరిమళలాలు తనను ఎప్పటికీ వెన్నంటే ఉంటాయని అన్నారు.

భగవాన్ దాస్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి ..
బుద్ధభవన్ నిర్మాణం కార్యరూపం దాల్చడంలో భగవాన్ దాస్ ఎంతో శ్రమపడ్డాడని, ఎందరినో కలుపుకుని అలుపెరుగని పోరాటాలు చేశారని దాస్యం తెలిపారు. భగవాన్ దాస్ ఏ పని చేపట్టినా దాని ఫలితం వచ్చే వరకు వదిలేవారు కాదని, పట్టువదలని విక్రమార్కుడిలా ఉండేవాడని అన్నారు. అది అసంఘటిత, సంఘటిత కార్మికుల సమస్య అయినా , అన్యాక్రాంతం అయిన భూ సమస్య అయినా చివరి వరకు అకుంఠిత దీక్షతో పోరాటం చేసేవారని దాస్యం వినయ్ భాస్కర్ గుర్తు చేశారు. భగవాన్ దాస్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టినట్లు తెలిపారు.

విద్యా నిలయం బుద్ధభవన్ : చీఫ్ విప్ దాస్యం
బుద్ధభవన్ ఒడిలో ఎందరో జీవన పాఠాలు నేర్చుకున్నారని, జన చైతన్యానికి వేదిక బుద్ధభవన్ అని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. భగవాన్ దాస్ ఆలోచన మేరకు రూపుదిద్దుకుని ఎందరికో స్ఫూర్తి నింపిన బుద్ధభవన్ పునర్ నిర్మాణానికి తనవంతు సహకారం ఖచ్ఛితంగా అందిస్తానని, బుద్ధభవన్ నిర్మించి 67 వసంతాల్లోకి అడుగిడిన సందర్భంగా కుమార్ పల్లి వాసులకు తన వంతుగా ఒక గిఫ్ట్ ఇస్తానని దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. దళితుల్లో వెలుగులు నింపిన బుద్ధభవన్ సాక్షిగా కుమార్ పల్లిలోని దళితులకు దళితబంధుతో న్యాయం జరిగేలా చేస్తానని దాస్యం వినయ్ భాస్కర్ కుమార్ పల్లి వాసులకు హామీ ఇచ్చారు. అలాగే బుద్ధభవన్ పునర్ నిర్మాణంలో ప్రతీ ఒక్కరు చేయూతనందించాలని ఆయన కోరారు. అలాగే ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు.బుద్ధభవన్ కి ఋణపడి ఉంటా : దాస్యంఆత్మీయ పలకరింపులు, నాటి జ్ఞాపకాలతో కుమార్ పల్లి వాసులు
ఆ కార్యక్రమంలో భాగంగా బుద్ధ‌భ‌వ‌న్ అభివృద్ధి క‌మిటీ ప్రతినిధులు, నాడు బుద్ధభవన్ నిర్మాణంలో భాగస్వాములైన శ్రామికులు,యువకులు, మహిళలు, భగవాన్ దాస్ సన్నిహితులు, ఆత్మీయులు ఫోటోలు దిగి, నాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. భగవాన్ దాస్ స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు.బుద్ధభవన్ కి ఋణపడి ఉంటా : దాస్యంఈ కార్యక్రమంలో బుద్ధ భవన్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బుద్ధ భవన్ విశ్లేషకులు డాక్టర్ రాజ సిద్ధార్థతో పాటు కమిటీ కార్యదర్శి వంగల సుదర్శన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి కూనమల్ల జితేందర్ నాథ్, మరియు విశ్లేషకులు గొర్రె రవికుమార్, సాంస్కృతిక సారధి రాజ లింగం, అంకేసరపు సారయ్య ,ఎస్ గణేష్ బూజుగుండ్ల కిషన్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు యాళ్ల సంజయ్, కార్యదర్శి సాదు వేణు, కోశాధికారి డాక్టర్ పీసరి లక్ష్మణ్ , సీనియర్ జర్నలిస్ట్ బీఆర్ లెనిన్, గోకారపు శ్యాం, భగవాన్ దాస్ కుటుంబసభ్యులు, జర్నలిస్టులు, మహిళలు, యువత, చిన్నారులు, స్థానిక కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ విద్యాసాగర్, తదితరులు  పాల్గొన్నారు.