రూల్స్ ఉల్లంఘిస్తే చర్యలే : కల్నల్ ఏబి దుబే
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : వరంగల్ గ్రూప్ హెడ్ క్వార్టర్ ఎన్సీసీ నుంచి వరంగల్ , ఖమ్మం ఎన్సీసీ యూనిట్స్ ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు, స్కూల్స్ కి ప్రభుత్వ చట్టం, ఎన్సీసీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్సీసీ న్యూఢిల్లీ నూతనంగా కొన్ని రూల్స్ ప్రకటించినట్లు వరంగల్ ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ ఏబీ దుబే గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ చట్టం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్సీసీ న్యూఢిల్లీ రూల్స్ ప్రకారం నూతనంగా మొదటి సంవత్సరంలో ఎన్సీసీలో ప్రవేశం పొందిన క్యాడేట్స్ కు రూ.19, రెండవ సంవత్సరం, మూడో సంవత్సరం అడ్మిషన్ లో ఉన్న క్యాడేట్స్ కు రూ.4,(ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు పది రోజుల క్యాంపులో మెస్సింగ్, అకామిడేషన్, పిఓఎల్ చార్జీల కోసం రూ.1913. 20 పైసలు మాత్రమే)క్యాడేట్స్ వద్ద వసూలు చేయాలని కల్నల్ ఏబీ దుబే సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు. విద్యాసంస్థలకు ఎన్సీసీ యూనిట్ కూడా రద్దు చేయడం జరుగుతుందని వరంగల్ ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ ఏ బి దుబే హెచ్చరించారు.